స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా భవనంపై భారతదేశ జెండాను ప్రదర్శించారు. సరిగ్గా అర్థరాత్రి 12.01నిమిషాలకు ఎల్ఈడీ లైట్లతో మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పొంగిపోయారు.
రోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉండి ఇబ్బంది పడుతుంటే రోజూ నడవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా నడక మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మీరు ఎంత ఎక్కువ దూరం నడిస్తే, మీ వయస్సును అంత పెంచడంలో సహాయపడుతుందని అంటున్నారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. ఉదయం 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆజాద్‌పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను కలిశారు. అనంతరం రామేశ్వర్‌తో కలిసి రాహుల్ భోజనం చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో రామేశ్వర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది.
(ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఆమే కొనియాడారు.
ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు.