జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదని తెలిపారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారాయన. ‘ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని.. కానీ హిందూమతం పురాతనమైనదిగా పేర్కొన్నారు. అంతేకాకుండా.. ముస్లింలలో పది, ఇరవై మంది బయటి నుండి వచ్చిన వారై ఉండాలి. మిగిలిన వారంతా హిందుత్వం నుండి ముస్లింలుగా కన్వర్ట్ అయినవారు’ అన్నారు. ఇస్లాం మతం సుమారు 1500 సంవత్సరాల క్రితం ఉద్భవించిందని అన్నారు.
Group 1 and Group 2 Notification: త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు..
జమ్ము కశ్మీర్‌లోని డోదా జిల్లా తాల్హ్రీ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గులాం నబీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ ల గురించి మాట్లాడుతూ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారన్నారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లీం కూడా లేరని, ఇక్కడి పండిట్స్‌లో చాలామంది ముస్లింలుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఇక్కడి వారంతా కూడా హిందూమతంలోనే జన్మించారన్నారు. హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు…ఇలా పేరుకి వేరువేరుగా ఉన్నా అందరి మూలాలు ఒక్కటేనన్నారు. ఇక్కడికి ఎవరూ కూడా బయటి నుండి రాలేదని, అందరూ ఇక్కడి వారేనని ఆయన తెలిపారు. మనమంతా ఇదే మట్టిపై పుట్టామని, ఇదే మట్టిపై మరణిస్తామన్నారు. మొఘల్ సైన్యంలో 10-12 మంది ముస్లింలు భారత్ కు వచ్చారని, ఆ తర్వాత మతమార్పిడులు జరిగాయని చాలా సందర్భాల్లో చెప్పారన్నారు.
Baby On Aha: ‘ఆహా’లో బేబీ వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే?
పార్లమెంటులో కూడా ఎన్నో విషయాలు మాట్లాడానని, కానీ అవన్నీ మీ వరకు రాకపోయి ఉండవచ్చునని అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ దేశానికి మీరు బయటి నుండి వచ్చారని ఓ సారి ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారని, దానికి తాను మాట్లాడుతూ… ఎవరూ బయటి నుండి రాలేదని, అందరూ ఇక్కడి వారేనని చెప్పానని, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వచ్చి 1500 సంవత్సరాలు మాత్రమే అవుతోందని, కానీ హిందుత్వం పురాతనమైనదని తాను సమాధానం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.
Bandaru Vijayalakshmi: పార్టీల చూపు బండారు విజయలక్ష్మి వైపు ..!?
గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్…ఆ తరవాత Democratic Azad Party స్థాపించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పని చేసిన ఆయన ఉన్నట్టుండి ఆ పార్టీని విడిచి పెట్టి బయటకు రావడం సంచలనమైంది. జమ్ముకశ్మీర్‌కి ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు ఆజాద్. ఈయన వచ్చే సమయానికే చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ విడిచి పెట్టారు. మరోవైపు రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు గులాం నబీ ఆజాద్.