టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో పాల్గొ్న్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తలనరికి తీసుకురావాలని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
తిరుపతిలో సీపీఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను నిర్వహించింది. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని ఓడించాలి.. ఏపీలో వైసీపీని ఓడించాలన్నారు.
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్ అని ఆరోపించారు. అచ్చెన్నమాటలు రైతులు మధ్య కొట్లాటలు జరిగేలా ఉన్నాయని దుయ్యబట్టారు. టెక్కలి - పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా మాటలు ఉన్నాయని మంత్రి సీదిరి అన్నారు. టీడీపీ హాయాంలో ఎత్తిపోతల పథకాలు ఇష్టానుసారంగా నిర్మించారని.. గతంలో లిఫ్ట్ లు ఆన్ చేస్తే.. పలాస చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని తెలిపారు.
దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు.
ఫ్లెక్సీ వార్ పై వర్గపోరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించారు. తెలుగు తమ్ముళ్లు ఒక మహిళా సర్పంచ్ పై దాడికి దిగడం ఆ పార్టీ దిగజారుడు తనాన్ని బయటపడుతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా.. వారి వర్గపోరు బహిర్గతం అవుతుందని అన్నారు. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర.. యువగళం కాదని గొడవలగళంగా వర్ణించారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.