ఎమ్మిగనూరులో వైద్యుని నిర్లక్ష్యంతో శిశువు మృతి పై అధికారులు స్పందించారు. శిశువు మృతిపై NTV లో వరుస కథనాలు ప్రసారం కావడంతో.. జిల్లా వైద్యాధికారిణి సత్యవతి విచారణ చేపట్టారు. బాలుడికి చికిత్స కోసం తీసుకొచ్చిన సూర్యతేజ హాస్పిటల్ లో రిటైర్డ్ సూపరెంటెండెంట్ డా. బాలయ్యను వైద్య అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. శిశువుకు చికిత్స చేసిన డాక్టర్ రాఘవేంద్ర వివరాలపై ఆరా తీస్తున్నారు.
రేపు(శనివారం) శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు ‘డూ ఆర్ డై’ లాంటిది. శ్రీలంకపై బంగ్లాదేశ్ ఓడిపోతే.. నిష్క్రమించడం దాదాపు ఖాయం.
బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై పురందేశ్వరి కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15 నుంచి 17 జిల్లాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించారు. ఆచార్య రుత్విక్ నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యా్చ్ లో 7 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది.
ప్రధాని మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.