Minister Amarnath: చంద్రబాబు ఐటీ కేసులపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని విమర్శలు చేశారు. రూ. 118 కోట్ల లంచాల కేసులో తన పీఏ శ్రీనివాస్ ను, బ్రోకర్ మనోజ్, వాస్ దేవ్, పార్థసారథిలను చంద్రబాబు దేశం దాటించి, పారి పోయేలా చేశాడన్నారు. తప్పు చేయనప్పుడు వారిని ఎందుకు దేశం దాటించారని మంత్రి అన్నారు. ఒకరు అమెరికా, మరొకరు దుబాయ్ పారిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
Read Also: Dil Raju: స్కందకి చంద్రముఖి 2 షాక్.. దిల్ రాజు ఇప్పుడు ఏం చేస్తాడు?
ఇదిలా ఉంటే.. లంచాలు తీసుకున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని మంత్రి అమర్నాథ్ అన్నారు. అది తెలిసే తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ ఎందుకు స్పందించడం లేదని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. అవినీతిలో చంద్రబాబుకు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్నా లాక్కుని వస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Ambati Rambabu: దొంగతనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడు
మరోవైపు చంద్రబాబుపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హాయంలో ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలు అంతా దోచేశారని తెలిపారు. ఇన్ కమ్ టాక్స్ విచారణలో చంద్రబాబు అవినీతి బండారం బట్ట బయలయ్యిందని.. ఈ స్కామ్ కు పాల్పడిన చంద్రబాబు బాబు జైలుకు పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజాధనం అవినీతికి పాల్పడిన చంద్రబాబును అరెస్టు చేయడం కాదు.. ఉరి శిక్ష వేసిన కూడా తప్పులేదని ఘాటు విమర్శలు చేశారు. టీడీపీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు.