జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు.
2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు అరెస్ట్ పై ఉదయం నుంచి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబును సీఐడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. ‘పిచ్చోడు లండన్‌కి… మంచోడు జైలుకి… ఇది కదా […]
తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది.
శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు.
చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీం ను స్కాం గా మార్చారని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్ర వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సిద్ధార్థ లోధ్రా అండ్ టీమ్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు సిద్ధార్థ లుద్ర.
చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ సంస్థలు గుడ్డిగా వెళ్ళిపోవని స్పీకర్ అన్నారు. చట్టంకి ఎవరూ చుట్టం కాదని తెలిపారు.