యూపీలోని వారణాసిలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ గమనించి కారులో నుంచి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.
ఢిల్లీలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ గురించి చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
జీ- 20కి సంబంధించిన విందుకు ఆహ్వానంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'భారత రాష్ట్రపతి' అని సంబోధించడంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. భారత్, ఇండియా అంటే ప్రేమ అని అన్నారు.
ఇప్పటికే శ్రీలంకలో వర్షాలు భారీగా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటినుంచి జరగబోయే మ్యాచ్ లకు వర్ష ప్రభావం ఏమీ ఉండదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు.
డీగ్ జిల్లాలోని గోపాల్‌గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్‌ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్‌ను అరెస్టు చేశారు.