Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
- హోటల్ ఫుడ్ ఐటెమ్స్‌కు అదనపు ఛార్జీలు..
- గ్యాస్ కొరతే కారణం అంటున్న హోటల్ యాజమాన్యాలు..
- యుద్ధ ప్రభావంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని సెగ భారతీయ సామాన్యుడి వంటగది వరకు తాకింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఆయిల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామం నేడు దేశవ్యాప్తంగా హోటల్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ దిగుమతులు తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమైన గ్యాస్ అందడం లేదు. ఈ సరఫరా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా హోటళ్లు తమ బోర్డులను తిప్పేస్తున్నాయి. గ్యాస్ లేనిదే వంటలు చేయడం సాధ్యం కాకపోవడంతో యాజమాన్యాలు హోటళ్లను మూసివేస్తున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు మాత్రం భారాన్ని కస్టమర్లపై వేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు కొనాల్సి వస్తోందని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచుతున్నామని హోటల్ యజమానులు వాపోతున్నారు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
గతంలో రూ.40 ఉన్న టిఫిన్ ధర ఇప్పుడు రూ.60 నుంచి రూ.70కి చేరింది. సాధారణ ప్లేట్ మీల్స్ ధరపై 20 శాతం నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది. చాయ్, కాఫీ వంటి కనీస అవసరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో దీని ప్రభావం అధికంగా పడింది. కర్రీ పాయింట్ లో కూడా అదనపు డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
నిన్నటి వరకు సాధారణంగా ఉన్న ధరలు, నేడు రెట్టింపు కావడంతో బయట తినే వారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, బ్యాచిలర్లు, కూలీలు హోటల్ ధరలు చూసి కంగారు పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో గ్యాస్, ఆయిల్ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం హోటల్ రంగమే కాకుండా.. రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!