తిరుపతిలో సీపీఐ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను నిర్వహించింది. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 25జిల్లాల నుంచి కమ్యూనిస్టులు హాజరయ్యారు. దీంతో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ కమ్యూనిస్టులతో నిండిపోయింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని ఓడించాలి.. ఏపీలో వైసీపీని ఓడించాలన్నారు. వైసీపీ పాలనలో వేంకటేశ్వర స్వామిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. టీటీడీలో సారాయి అమ్మే వాళ్ళను సభ్యులుగా నియమించారని దుయ్యబట్టారు. మరోవైపు భక్తులకు కర్రలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు వెయ్యిమంది వైసీపీ కార్యకర్తలకు కర్రలిచ్చి పంపండని నారాయణ అన్నారు.
Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయన్ను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేయాలంటే చేయండి.. కానీ కోట్ల రూపాయలు అక్రమార్జన సంపాదించిన వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రిగా ఉండొచ్చానని విమర్శించారు. ప్రత్యేక హోదా ఏమైంది.. వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుమార్తెను కవిత కాపాడుకునేందుకు మోడీకి సాగిలపడుతున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. తాము నిర్వహించిన బస్సుయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని నారాయణ తెలిపారు.
Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ.. ఆగష్టు 17న బస్సు యాత్రను ప్రారంభించామని.. విశాఖ నుంచి 33 సంఘాలతో కలిసి బస్సు యాత్రను 26 జిల్లాల్లో కొనసాగించామని తెలిపారు. ఏపీలో గుంతలు పూడ్చే దిక్కే లేదని విమర్శించారు. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. అస్థవ్యస్థంగా ఉన్న రోడ్లలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులను పూడ్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కడప ఉక్కు పరిశ్రమకు సీఎం వేసిన పునాదిరాయి స్మశానరాయిగా మారిందని అన్నారు. ఒక్క సాగు-తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు. మరోవైపు ప్రశ్నిస్తే అరెస్టులు, జైలుకు పంపడం.. జగన్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. డబ్బు మదం, అహంకారంతో సీఎం రెచ్చిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని నియంతృత్వదోరణితో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.