Seediri Appalaraju: శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన క్రిష్ణదాస్, ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. గత నెల ఆగష్టు.. ఈ శతాబ్దంలోనే విపత్కరమైన నెల అని అన్నారు. నూట ఇరవై సంవత్సరాల క్రితం తీవ్ర వర్షాభావం ఏర్పడిందని.. ఇప్పుడు ఆగష్టులో అదే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నీటి మట్టం కూడా పూర్తిగా పడిపోయిందని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదని రెండు సార్లు సీఎం జగన్ రివ్యూ చేసారని తెలిపారు. అదృష్టవశాత్తూ రెండు రోజులనుండి వర్షాలు పడుతున్నాయని మంత్రి చెప్పారు.
Read Also: Minister Amarnath: చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతాం
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్ అని ఆరోపించారు. అచ్చెన్నమాటలు రైతులు మధ్య కొట్లాటలు జరిగేలా ఉన్నాయని దుయ్యబట్టారు. టెక్కలి – పలాస నియోజకవర్గ రైతులు కొట్లాడుకునేలా మాటలు ఉన్నాయని మంత్రి సీదిరి అన్నారు. టీడీపీ హాయాంలో ఎత్తిపోతల పథకాలు ఇష్టానుసారంగా నిర్మించారని.. లిఫ్ట్ లు ఆన్ చేస్తే.. పలాస చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని తెలిపారు. అచ్చెన్నాయుడు లాంటి దౌర్భాగ్యుడవల్లే జిల్లా వెనకపడిందని మండిపడ్డారు. జిల్లాకు ఒక్క మంచి పని, ప్రాజెక్ట్ అయినా చేసారా అచ్చెన్నా.. అని సీదిరి అప్పలర్రాజు ప్రశ్నించారు. మీ ఊరిలో స్కూల్, హాస్పిటల్ సైతం మేమే కట్టించామని సీదిరి చెప్పారు. రూల్స్ ప్రకారమే వంశధార నీటి సరఫరా జరుగుతోందన్నారు. ఇక రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అచ్చెన్నాయుడు చేయోద్దని హితవు పలుకుతున్నామని మంత్రి సీదిరి అన్నారు.