భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ ఎంతో ముఖ్యమైనది. ప్రతి వంటకాల్లోనూ ఉల్లిపాయను వేస్తుంటారు. ఉల్లిపాయను సుగంధ ద్రవ్యాల కోసం, ఆహార రుచిని పెంచడానికి కూరల్లో వాడుతుంటారు. అయితే తరుచుగా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచుతారు. అలా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచితే మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టులో షమీ తన సత్తాను నిరూపించుకుంటున్న సమయంలో.. అతని విడిపోయిన భార్య హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపింది. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొంది. అతను మంచి ఆటగాడు మాత్రమే కాకుండా.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని హసిన్ జహాన్ తెలిపింది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే.... ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది.
మెంతికూర మానవుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చటి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెంతులు రుచికి కొంచెం చేదుగానే ఉన్నా కానీ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మెండుగా ఉంటాయి. మెంతి ఆకులను ఎక్కువగా పరోటాలో వాడుతుంటారు. వేడి వేడి మెంతికూర పరోటా చాలా మందికి ఇష్టం.. మెంతికూర ఉపయోగించడం వలన అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. అయితే.. మెంతి ఆకులను అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు…
వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితం రావాలంటే ఒక్కరోజు వేచిచూస్తే సరిపోతుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండనుంది. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం.. టీమిండియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించి.. ఆ తర్వాత ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుందని తెలుపుతున్నారు. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పుతాడని.. ఫైనల్ మ్యాచ్లో జట్టును…
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.
ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా వస్తున్నారట. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.