వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. కంగారూ జట్టు 8వ సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు సౌతాఫ్రికాపై గెలిచి ఫైనల్ లో ఇండియాతో తలపడనుంది.
Koti Deepotsavam 3rd Day: మూడో రోజు ఘనంగా కోటి దీపోత్సవం.. వైభవంగా జోగులాంబ కళ్యాణం
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి వరకు ఆడి ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్ వార్నర్(62), ట్రేవిస్ హెడ్ (29) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ డకౌట్ కాగా.. స్టీవెన్ స్మిత్ (30) పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత లంబుషేన్ (18), మ్యాక్స్ వెల్ (1), ఇంగ్లిస్ (28), మిచెల్ స్టార్క్ (16), కమిన్స్ (14) పరుగులు చేశారు. ఇక.. సౌతాఫ్రికా బౌలర్ల కట్టడి దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ, షంసీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడా, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ కు తలో వికెట్ దక్కింది.
Devendra Fadnavis: బంపర్ మెజారిటీలో మూడోసారి ప్రధాని మోడీ అధికారం చేపడుతారు…
సౌతాఫ్రికా బ్యాటింగ్ లో డేవిడ్ మిల్లర్, క్లాసెన్ మినహా.. మిగతా బ్యాటార్లు అందరూ విఫలమయ్యారు. మిల్లర్(101) సెంచరీతో రాణించడంతో 212 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. క్లాసెన్ (47), డికాక్ (3), బవుమా (0), వాన్ డర్ డుస్సేన్ (6), మార్క్రమ్ (10), యన్ సన్ (0), కోయెట్జీ (19), మహరాజ్ (4), రబాడా (10), షంసీ (1) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు తీశారు. హేజిల్ ఉడ్, హెడ్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.