Vivo వినియోగదారుల కోసం కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y100i 5Gని విడుదల చేసింది. కంపెనీ Y సిరీస్‌లో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇచ్చారు.
ఆస్ట్రేలియా జట్టు ఈ పరుగులు చేయకుండ ఉండటానికి.. జట్టుకు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ అవసరం. అలాంటి క్రమంలో సౌతాఫ్రికా జట్టులో ఫీల్డింగ్ లో కొంత వైఫల్యం ఏర్పడినప్పటికీ.. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మాత్రం ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి సెంచరీ విరాట్ కు 50 సెంచరీ కావడంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సెంచరీని ఊహించని.. ఉత్తరప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది.
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటం కోసమని వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే మీరు మీ జుట్టు పొడవును పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా…
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలాగే రోహిత్ శర్మ ఇమిటేట్ చేశాడు. అయ్యర్ ని ఇమిటేట్ చేస్తూ రోహిత్ నడిచిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2023 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
ఐసీసీ ప్రపంచ కప్ 2023.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
టీ20 జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత షాహీన్ అఫ్రిదిలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. కెప్టెన్ అయిన తర్వాత.. షాహీన్ అఫ్రిది ఒక ట్వీట్‌లో ఇలా వ్రాశాడు. “నేను జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందుకు గౌరవంగా, సంతోషిస్తున్నాను. నాపై విశ్వాసం చూపినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు. జట్టు స్ఫూర్తిని కొనసాగించడానికి, క్రికెట్ మైదానంలో నా దేశానికి కీర్తిని తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తాను. అని తెలిపాడు.
ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన బౌలర్ గా మహమ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా షమీపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.