ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తన X ఖాతాలో.. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా కోసం ఉంటారని తెలిపారు. అంతేకాకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడాస్ఫూర్తిని నిలబెడతారని, బాగా ఆడండి అంటూ ట్వీట్ చేశారు.
కడయం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో 15 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి దానిని రక్షించారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన పరుగులను ఛేదించే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా జట్టు ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. "ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్" అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు, ఫైనల్ మ్యాచ్ కు వాతావరణ మార్పుల వల్ల మ్యాచ్ జరగని పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ రేపు అహ్మదాబాద్ లో వర్షం పడి మ్యాచ్ జరగకుండ ఉంటే.. మ్యాచ్ ను తర్వాత రోజుకు కేటాయించనున్నారు. ఆరోజు కూడా.. మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.