తాజా వరల్డ్ కప్ లో రన్ మిషన్, కింగ్ కోహ్లీ మంచి ప్రదర్శన చూపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ టోర్నీలో కోహ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. అంతేకాకుండా.. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించి.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ అరుదైన గౌరవం లభించింది. జైపూర్ లోని నహర్ గఢ్ కోటలో ఉన్న మైనపు విగ్రహాల మ్యూజియంలో కోహ్లీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
Read Also: World Cup 2023: ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలో మెరువనున్న పాప్ స్టార్ దువా లిపా..!
ఈ అంశంపై జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాప డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇక్కడ కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలంటూ పర్యాటకులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. అలాంటి తరుణంలో.. కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలతో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడని, అంతేకాకుండా.. టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉందన్నారు. అందుకోసమని విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుందని అన్నారు. ప్రస్తుతానికి బంక మన్నుతో కోహ్లీ నమూనా విగ్రహాన్ని రూపొందించామని, మరో నెలలో పూర్తిస్థాయి మైనపు విగ్రహం తయారుచేస్తామని శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాకుండా.. అటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: World Cup: వరల్డ్ కప్లో ఇండియా – ఆస్ట్రేలియా రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..!