ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సందేశం ఇచ్చాడు. “మేము ఇప్పటివరకు చేసిన ప్రతిదీ మా వెనుక సంవత్సరాల కృషికి క్రెడిట్. మేము ఇప్పుడు కీర్తికి ఒక అడుగు దూరంలో ఉన్నాము, మేము చిన్నప్పటి నుండి కలలుగన్న కలను నిజం చేయండి ”అని పాండ్యా అన్నాడు. కప్‌ను తమ కోసం మాత్రమే కాకుండా.. బిలియన్ భారతీయ ప్రజల కోసం కప్ ను తీసుకురావాలని జట్టును కోరాడు.
రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త.
రేపు (ఆదివారం) ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మహా సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ పరిస్థితులను ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ పరిశీలించారు.
అహ్మదాబాద్లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అన్నీ మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోష్ లో ఉంది. అయితే వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ సాధించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. మరో ట్రోఫీ కోసం ఆరాటపడుతుంది. రేపటి మ్యాచ్…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఓ మెజిషియన్తో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆ మెజిషియన్ ధోనీని కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు.
చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్‌లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్‌బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది.
బీసీసీఐ సెక్రటరీ జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడంటూ జై షాపై.. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక పార్లమెంట్‌లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున జై షాకు క్షమాపణలు తెలుపుతున్నట్లు చెప్పారు.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయాల జోరును చూపించింది. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టోర్నీ టైటిల్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు స్టేడియంకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం కొందరు అతిరథులు స్టేడియానికి రానున్నారు.