దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది.
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి తగిలాడు. ముందుగానే వాతావరణ సంస్థలు చెప్పిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాప్రికా 14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 398 పరుగుల భారీ స్కోరును చేసింది టీమిండియా.. ఈ క్రమంలో కివీస్ పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో కొత్త వివాదం వచ్చి పడింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ ఆటగాడు…
షాహిబాగ్‌లోని వసంత్ విహార్ ఫ్లాట్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. దీపావళి రోజున ఈ ప్రమాదం జరిగింది. ఆర్య కొఠారి అనే చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ లోకి వెళ్లాడు. ఆర్య కొఠారి లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే లిఫ్ట్ డోర్ మూసుకుంది. దీంతో అతను లిఫ్ట్, ఫ్లోర్ మధ్య ఇరుక్కుపోవడంతో.. తల లిఫ్ట్ గేటులో ఇరుక్కుపోయింది.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదన్న విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో ఓటమి విషయాన్ని మర్చిపోవాలని అన్నాడు. గతంలో ఏం జరిగిందని కాదు.. గతం గురించి పట్టించుకోమన్నాడు. తమ ఫోకస్ అంతా రేపటి మ్యాచ్ పైనే అని తెలిపాడు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా రేపు, ఎల్లుండి సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీస్ కు చేరిన లిస్ట్ లో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బలమైన జట్లు ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు సంబంధించి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఆడబోయే రెండు జట్ల గురించి ఆమ్లా జోస్యం చెప్పాడు.
2020లో కొవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల పాటు ప్రపంచాన్నే చెడుగుడు ఆడుకున్న కరోనా.. మళ్లీ కోరలు చాస్తుంది. అయితే అందరూ ఇక కరోనా అంతమైపోయిందనుకున్నప్పటికీ.. మరో కొత్తరకం వేరియంట్ కలవరపెడుతుంది. జేఎన్ 1 రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.