తాజా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి నాలుగు మ్యాచ్ ల్లో ఆడనప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్ లకు అవకాశం రావడంతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే భారత క్రికెట్ జట్టులో షమీ తన సత్తాను నిరూపించుకుంటున్న సమయంలో.. అతని విడిపోయిన భార్య హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: World Cup Final: సింగిల్ రూంకి రూ.1.25 లక్షలు.. చుక్కల్ని అంటుతున్న హోటల్ రేట్లు, విమాన ఛార్జీలు..
మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపింది. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొంది. అతను మంచి ఆటగాడు మాత్రమే కాకుండా.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని హసిన్ జహాన్ తెలిపింది. షమీ చేసిన తప్పుల వల్ల.. దురాశ కారణంగా, అతని వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. షమీ డబ్బు ద్వారా తన ప్రతికూల అంశాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని కామెంట్స్ చేసింది.
Read Also: Viral Video: కనకవర్షం కురిపించిన ఏటీఎం.. షాకింగ్ వీడియో..
న్యూజిలాండ్‌పై సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఆ అంశంపై హసిన్ జహాన్ స్పందిస్తూ.. “నాకు ప్రత్యేకంగా ఏమీ అనిపించ లేదు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం విశేషం. ఫైనల్‌లోనూ భారత్ విజయం సాధించాలని ప్రార్థిస్తున్నాను. అని తెలిపింది. ఇక.. పాయల్ ఘోష్ విషయంపై మాట్లాడుతూ.. ఇలాంటివి సెలబ్రిటీలకు జరుగుతూనే ఉంటాయి. ఇది సాధారణమైనది. నేను దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు అని ఆమె చెప్పింది.