హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 60 సంవత్సరాల వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తనకు గెలుపు ఓటమి రెండు సమానమే అని సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఎంజాయ్ చేస్తానని తెలిపారు. చివరి రెండు రోజులే కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి కారణమని అన్నారు. సంగారెడ్డి ప్రజల తీర్పు స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్పారు. అంతేకాకుండా.. కేబినెట్ లో సీనియర్లు అంతా సమర్థులేనని అన్నారు.
శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకోకుండానే.. మధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను నియమించారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంథనికి వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో.. మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై అనుమానాలు వద్దు, ఆరు గ్యారంటీలని ఆరు నూరైనా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి లేకున్నా.. ఎక్కడికైనా పోయి తిరిగి రావచ్చు ఇది కదా మహిళ సాధికారత అని ఆయన అన్నారు
బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత పై నీటి పారుదల శాఖ మంత్రి…
సిటీ పోలీస్ తో కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో డ్రగ్స్ నిర్మూలనపై చర్చించారు. రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ ని పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాటు చేయండని కమిషనర్ తెలిపారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని ఆయన అన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు…
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి సంజయ్ విమర్శించారని పేర్కొన్నారు.
హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.