పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ అది ఏమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకు వెళ్ళడానికి అని ప్రశ్నించారు?. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకు వెళ్ళండని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కవిత అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగి పోయింది..…
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ జెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలో.. సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఆరేళ్లలో 50 లక్షల మందికి ఇల్లు కట్టించాము.. కానీ తెలంగాణలో 2 లక్షల ఇల్లు కూడా కట్టలేదన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద 35 లక్షల మందికి ఎకరానికి 6 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మనది ప్రజలందరిది.. తాడిత, పీడిత, దళిత, గిరిజన అణగారిన వర్గాలు నోరు లేనటువంటి వారికి గొంతుకగా నిలిచేదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత గిరిజన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకురావాలని..…
అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. నిజంగానే సిగ్గు పడుతున్నా.. పంట భీమా, రైతు భీమాకి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు సీఎం అని ఎద్దేవా చేశారు. అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39 కోట్లు.. 2014 తర్వాత ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుక మాఫియా మాది కాదు.. కాంగ్రెస్ దని…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా సాగాయి. ఈ క్రమంలో.. మళ్లీ ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి విరుచుకుపడగా.. అటు ప్రతిపక్ష నేత కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు.