CP Srinivas Reddy: సిటీ పోలీస్ తో కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో డ్రగ్స్ నిర్మూలనపై చర్చించారు. రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ ని పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాటు చేయండని కమిషనర్ తెలిపారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని ఆయన అన్నారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
మరోవైపు.. పబ్ లపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పబ్బులు సమయానికి మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలి.. సమయం మించి పబ్ నడిచినట్లైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్ లలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.. పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టండని పోలీసు అధికారులకు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.