Bihar: బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
Read Also: CM Revanth: రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని 38 జిల్లాల్లోని మొత్తం 613 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సమయంలో చీటింగ్‌లను గుర్తించి నిరోధించడానికి AI ఆధారిత వ్యవస్థలను BPSSC ఉపయోగిస్తుందని BPSSC చైర్మన్ KS ద్వివేది తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై నిఘా ఉంచేందుకు AI-ఆధారిత వ్యవస్థ ఫేస్ ఐడెంటిటీ, ఐ ట్రాకింగ్, ఇతర పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 16,500 సీసీ కెమెరాల సాయంతో అన్ని కేంద్రాల ఎగ్జామినీలు, ఇన్విజిలేటర్లు, అడ్మినిస్ట్రేటర్లు, ఎగ్జిట్-ఎంట్రీ గేట్లను పర్యవేక్షిస్తామన్నారు. పరీక్షలో ఎవరైనా అన్యాయమైన మార్గాలను ఉపయోగించి, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వచ్చే మూడేళ్లపాటు కమీషన్ పరీక్షకు హాజరు కాలేరని KS ద్వివేది తెలిపారు.
Read Also: B.Vinod Kumar: తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారు.