Jagga Reddy: తనకు గెలుపు ఓటమి రెండు సమానమే అని సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఎంజాయ్ చేస్తానని తెలిపారు. చివరి రెండు రోజులే కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి కారణమని అన్నారు. సంగారెడ్డి ప్రజల తీర్పు స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్పారు. అంతేకాకుండా.. కేబినెట్ లో సీనియర్లు అంతా సమర్థులేనని అన్నారు.
Read Also: Breaking News: అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
రాహుల్ గాంధీని తాను ఏం అడగనన్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెంప దెబ్బ కొట్టినట్టు చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది సోనియా అని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి.. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడే అవకాశం ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేందుకు కృషి చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: IAS Transfer: తెలంగాణలో 11 సీనియర్ ఐఏఎస్లు బదిలీ..