Road Accdient: హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
Read Also: Nagababu: 2024 ఎన్నికలే లక్ష్యం.. జనసైనికులు కలిసికట్టుగా పనిచేయాలి..
పోలీసుల వివరాల ప్రకారం.. విశాల్ ఎన్ఐటిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బోడుప్పల్ లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతూ.. పార్ట్ టైంగా రాపిడో బైక్ నడుపుతున్నాడు. విశాల్ రాపిడ్ బైక్ తో బోడుప్పల్ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల సమీపంలోని రోడ్డు పక్కన నిలుచుండగా.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్, కారును అతివేగంతో నడుపుతూ, రోడ్డు పక్కకు ఆగి ఉన్న విశాల్ ని ఢీకొట్టాడు.
Read Also: Minister Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత ఇలాకాకు సీతక్క
ఈ ప్రమాదంపై విశాల్ స్నేహితులకు సమాచారం అందించగా.. స్నేహితులు ఘటన స్థలానికి చేరుకొని హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు గోండు విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్ లోని గోరిక్ పూర్. మృతుడి తండ్రి షాంబుప్రసాద్, తల్లి మంజు దేవి.. వీరికి నలుగురు సంతానం, నలుగురిలో పెద్ద వాడు విశాల్. స్నేహితుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. కారు డ్రైవర్ పరార్ లో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.