శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచి పోయారని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను అధికారులు బ్లేమ్ చేశారు.. 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంను బదానం చేశారని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపొద్దు.. వాళ్లు అన్ని వినాలని స్పీకర్ కు తెలియజేశారు. ఎంత గొడవ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్ కు చెప్పారు. గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు.. ఔను నువ్వు సిగ్గు పడాలని ముఖ్యమంత్రి విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్ని చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. కరోనా…
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు.. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో…
సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసిఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు ఉండకుండా చూడాలి.. మార్షల్ కి పని చెప్పకుండా పని చేద్దామని కూనంనేని తెలిపారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచిది కాదు అని తన ఉద్దేశమన్నారు. తక్కువ రోజులు కాకుండా.. ఎక్కువ రోజులు సభ జరపండి.. ఆరు గ్యారంటీల…
ఈరోజు లోక్సభలోకి ఆగంతకులు చొచ్చుకునిపోయిన సంఘటన తెలిసిందే. ఇదే విషయమై సాయంత్రం ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.