K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు.. తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.
Read Also: PM Modi: ఖలిస్తానీ పన్నూ హత్య కుట్రపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ..
అంతేకాకుండా.. నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని కేఏ పాల్ అన్నారు. వడ్డీలు కూడా కట్టలేదు.. ఇతర సాకులతో గడిపేస్తారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీకి ఇక సింబల్ రానుందని కేఏ పాల్ తెలిపారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారట.. దేశంలో రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని ఆయన పేర్కొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు కోరారు.. తాను వెళ్ళలేదని కేఏ పాల్ తెలిపారు.
Read Also: Ramcharan -Upasana : క్లింకారతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్-ఉపాసన..