కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎలుకల బాధకి ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆదాయం ఎలా సమకూర్చుతారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులకు, జీతాలకు 70 శాతం ఆదాయం పోతే.. మిగతా 30 శాతం నిధులతో గత సంక్షేమ పథకాలతో పాటు కొత్తవి ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల పాలైంది అని చెబితే కొత్త అప్పులు ఎలా పుడుతాయని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Read Also: Uttam Kumar: ప్రాజెక్టుల అవినీతిపై విచారణ చేస్తాం.. బాధ్యులను శిక్షిస్తాం
అప్పులు చేయొద్దు, ప్రజల పై భారం మోపొద్దు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్ చేస్తుందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ చేయక పోతే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ప్రభుత్వంని బీజేపీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మేము ఎవరికీ మిత్రపక్షం కాదు, మీరే గతంలో కలిసి పోటీ చేశారు ఆ ఫ్లేవర్ ఇంకా పోనట్టుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు, పార్లమెంట్ పై దాడి పై చర్చకు తాము సిద్దమని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఒకటి నుండి 8కి వచ్చాము.. 8 నుండి 80 అవుతామని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Read Also: CM Nitish Kumar: “హిందీ తెలిసి ఉండాలి”.. ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే నేతపై ఆగ్రహం..