భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ భూమి 209 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలు చేపట్టారని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ వద్ద గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా సంబంధిత భవన ధ్రువపత్రాలు చూపని ఎడల కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.