తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అంటున్నారు.. ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి ఆయకట్టు సున్నా.. కొత్త ఆయకట్టు లేకుండా, లక్షల కోట్లు పెడితే వృధా కాదా అని మంత్రి ఉత్తమ్ అన్నారు.
Read Also: TS Assembly: రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో రభస..
మేడిగడ్డపై ఆనాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్అండ్టీ మాకు ఏం సంబంధం అని అంటోంది. డిసైన్ ఇచ్చారు.. మేము కట్టాం అంతే అంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే.. ఇంకెవరు సర్.. డిజైన్ చేసేది వాళ్లే కదా అన్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతాం.. బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
Read Also: New Covid Variant JN.1: దేశంలో కొత్త వేరియంట్ JN.1 కలకలం.. ఇప్పటి వరకు 21 కేసులు నమోదు..
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సివిల్ సప్లై శాఖ బియ్యం ఇవ్వడానికి.. వడ్లు కొనడానికి పరిమితం అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 3300 కోట్లున్న అప్పు.. 56 వేల కోట్లు పెరిగిందని ఆరోపించారు. గత సర్కార్.. నిరుపేదలకు బియ్యం ఇచ్చే శాఖకు ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. గత పాలన మూలంగా 11 వేల 500 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. 22 వేల కోట్ల ధాన్యం రైస్ మిల్లర్ల దగ్గర పెట్టారు.. వివరాలు కూడా లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వం రైస్ కొంటామని అడిగింది.. స్టాక్ ఉన్నా అమ్మలేదని ఉత్తమ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ రాజకీయ కారణాలతో ఉన్న ధాన్యం కూడా అమ్మలేదని మంత్రి ఆరోపించారు.