తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో రభస నెలకొంది. నిన్ను కేసీఆర్, కేటీఆర్ వాడుకుని వదిలేస్తారు అని మాజీ మంత్రి హరీష్ రావును రాజగోపాల్ అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మొన్న జరిగిన సభలో హరీష్ రావు… రాజగోపాల్ రెడ్డిని నీకు మంత్రి పదవి రాదు అని అన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎంత కష్టపడ్డ నీకు ఏం రాదు అని హరీష్ రావును రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Read Also: K.A Paul: మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు
దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి గొడవలు సరికావని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క చెప్పారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రాజగోపాల్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ తెచ్చుకున్నాడని విమర్శించారు. దీంతో.. మంత్రి శ్రీధర్ బాబు కలుగజేసుకుని మాట్లాడుతూ.. హరీష్ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని తెలిపారు.
Read Also: Prashanth Neel: నా మూడు సినిమాలు నాకు నచ్చలేదు.. సలార్ కు అందుకే భయపడుతున్నాను
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి విత్ డ్రా చేసుకుంటే తాను చేసుకుంటానన్నారు. ఈ క్రమంలో.. హరీష్ రావు వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగిస్తున్నామని స్పీకర్ తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ సీఎంగా రేవంత్ ని ఎన్నుకున్నారు.. పదేళ్లు మీరేం చేశారో చెప్పండని అన్నారు. మీ బావ బామ్మర్దులు ఎట్లా కొట్లాడారో చెప్పాలా అని హరీష్ రావు విమర్శలు చేశారు.