రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులతో ఓ యువకుడు బలయ్యాడు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరు పక్షాలకు సూచించారు. సభ హుందాతనం కాపాడండి అని తెలిపారు. కొత్త సభ్యులు నేర్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత దూషణలు వద్దు.. మేము, వాళ్ళు ఇద్దరు వ్యక్తి గత దూషణలు వద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఎలా…
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో మంటలు చెలరేగాయి. 8వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం సంభవించడంతో భవనంలో ఉన్న వారిని పూర్తిగా ఖాళీ చేయించారు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. విద్యుత్ పై స్వల్పకాలిక చర్చపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పర్మినెంట్ అనుకున్నారు.. ప్రజలు ఇచ్చిన షాక్ తో తిమ్మతిరిగింది..ఇంకా బయటకు రాలేక పోతున్నారని విమర్శించారు. అహంకార మాటలు చూసి బుద్ది రావాలని ప్రజలు బీఆర్ఎస్ నేతలను పక్కన పెట్టారని ఆరోపించారు. అయినా బుద్దిరాలేదని అన్నారు. పార్టీ మార్పులపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారు.. కాంగ్రెస్, టీడీపీ,…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. విద్యుత్ పై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ జరిపించవచ్చని అన్నారు. ERC నియమ నిబంధన ప్రకారమే విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు గంటల కరెంటు ఇచ్చిన పరిస్థితి లేదని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లు…
అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నారన్నారు. అది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియడం లేదు వాళ్లకని విమర్శించారు. గత ప్రభుత్వం వాస్తవాలు ఎప్పుడూ సభ ముందు పెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి ప్రజల ముందు పెడతాం.. వాస్తవాలు ఒప్పుకుని.. హుందాగా ఉంటే బాగుంటుందని తెలిపారు. జగదీష్ రెడ్డి విచారణ చేయండి అని సవాల్ విసిరారు.. జ్యుడీషియల్ విచారణకి సిద్ధమని ముఖ్యమంత్రి అన్నారు. మూడు…
కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.
సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు వీలు కల్పించింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఇంతకుముందు.. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించగా.. ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది.