గుంటూరులో కలకలం రేపుతోంది. కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడచిన నాలుగురోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరుతున్నారు. డయేరియాతో ఒకరు చనిపోగా.. మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, అనారోగ్యం బారిన పడ్డారని.. అనారోగ్యానికి గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో వివరాలు…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానని.. తనను గెలిపించండని కోరారు. తనను ఓడించడానికి పురందేశ్వరికి, జీవీఎల్ కు రూ. 1200 కోట్లు ఖర్చు చేయమని మోడీ చెప్పారని తెలిపారు. మరోవైపు.. వైజాగ్ లో వెయ్యి కోట్లు ఖర్చుచేసి తనను ఓడించాలని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ తనపై వైజాగ్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు నెలల క్రితం జేడీ లక్ష్మీనారాయణను కలిశానని.. జేడీని తనతో…
వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం కావడంతో సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలను, యువతను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, మహిళలను దగా చేశాడని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో అందరికీ అండగా ఉండాలని నారా లోకేష్ పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలని శంఖారావం కార్యక్రమంతో ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు సీపీఆర్ చేశారు. సీపీఆర్ తర్వాత మహిళా…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్క సుమన్ దగ్గరే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడి చెప్పు చూపించారు. తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు ఉండాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కి…
ఈ నెల 20వ తేదీ నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు యాత్రలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఈ యాత్రలను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యాచరణ చేపట్టనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేపట్టేలా ప్లాన్ చేయనుంది.
తెలంగాణలో 133 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. 32 మంది ఆర్డీవోలు కూడా బదిలీ అయ్యారు. వారితో పాటు.. డిప్యూటీ కలెక్టర్లు, నయాబ్ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు బదిలీలు జరిగాయి. కాగా.. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్.. 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బరువుదెరువు కోసం వచ్చిన కొందరు ఒరిస్సాకు చెందిన కార్మికులు కలుషిత ఆహారం తిని బలయ్యారు. గౌరెడ్డి పేటలోని ఎమ్మెస్సార్ ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థత గురయ్యారు. దీంతో వెంటనే వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే చికిత్స పొందుతున్న 14 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.