బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుండి మూడు పదవులు ఉండాలి అనుకున్నామని మల్లారెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధం ఉన్నాడని చెప్పారు.
Bhatti Vikramarka: పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడంపై మండలిలో తీర్మానం..
జగ్గారెడ్డికి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతుండని మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసం తన పేరు ఎత్తుతున్నాడని ఆయన తెలిపారు. తన పేరు ఎత్తకపోతే ఆయన్ను ఎవరు పట్టించుకోరని విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుండి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయి చేస్తానని అన్నారు.
Mahi V Raghav: యాత్ర 2 కు నెగెటివ్ రివ్యూలు .. డైరెక్టర్ ఏమన్నాడంటే.. ?
బీఆర్ఎస్ నుండి మల్కాజ్గిరి లోక్సభ స్థానం టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి కన్ఫర్మేషన్ అయిందని మల్లారెడ్డి తెలిపారు. పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాడని ఆరోపించారు. అందుకే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుముందే, పట్నం మహేందర్ రెడ్డి వెళ్లి కూర్చున్నాడని తెలిపారు. కాగా.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.