తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళలో కూడా అణచివేతలు.. ఆధిపత్య ధోరణి కొనసాగిందని ఆరోపించారు. అందుకే మార్పు కావాలని ప్రజలు చూశారని తెలిపారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇవాళ సభకు రాలేదు.. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్.. ఆయన మేధావితనంతో సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది అరి అన్నారు. వారి సూచనలు తీసుకుని గౌరవిస్తాం.. కానీ ప్రతిపక్ష నేత సీటు ఇలా ఖాళీగా ఉండటం మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Pakistan elections: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకు ఓటమి.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలుపు..
ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాము 60 రోజుల పాలన పూర్తి చేసుకున్నాం.. గతంలో చాలా లోపభూయిష్టంగా నిర్ణయాలు జరిగాయని అన్నారు. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మంచి నిర్ణయాలను అభినందిస్తారు అనుకున్నాం.. సవరించాల్సిన విషయాలు చెప్తారు అనుకున్నాం.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల మెప్పుకోసం మాట్లాడారని ఆరోపించారు.
Ravindra Jadeja Father: నా కోడలి వల్లే కుటుంబంలో చీలికలు..! పట్టించుకోవద్దన్న జడేజా
మరోవైపు.. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలు గుండెలపై TG అని రాసుకున్నారు అని సీఎం రేవంత్ తెలిపారు. కేంద్రం కూడా TG అని నోటిఫై చేసిందని అన్నారు. కానీ వారి రాజకీయల కోసం TS అని పెట్టుకున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే.. కాకతీయులపై తిరుగు బాటు చేసిన సమ్మక్క సారాలమ్మ జాతర చేసుకుంటున్నామని తెలిపారు. కాకతీయుల రాచరిక పోకడలు వద్దని రాష్ట్ర చిహ్నంలో.. కాకతీయుల రాచరికం ఉండొద్దు అని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ తల్లి అంటే దర్పం ఉట్టిపడేలా ఉండాలి.. తల్లి ప్రేమ ఉట్టిపడాలి అని అనుకున్నాం.. అందుకే అమ్మలాగా తెలంగాణ తల్లి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.