పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అభినందించారు. గవర్నర్ ఆహ్వానంతో ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, సురేఖ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై… ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. చిరంజీవి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read Also: Uttam Kumar Reddy: కృష్ణా బోర్డుకు మేము ప్రాజెక్టులు అప్పగించలేదు..
“రాజ్ భవన్ లో ఇవాళ నాకు ఆతిథ్యమిచ్చిన గౌరవనీయ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో మేడమ్ గవర్నర్ తెలిపిన అభినందనలకు ధన్యవాదాలు. మీతోనూ, డాక్టర్ సౌందరరాజన్ తోనూ జరిగిన సమావేశం ఎంతో సంతోషాన్నిచ్చింది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవికి ఎన్డీయే ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: Pakistan Elections: “నేనే గెలిచాను”.. నవాజ్ షరీఫ్ ప్రకటన..