తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని.. రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. మరోవైపు.. రైతుబంధుపై పదే పదే మాట్లాడుతున్నారని.. గతంలో వారు ఎలా వేసారో గుర్తు చేసుకోవాలన్నారు. 2018-19లో యాసంగి పంటకు రైతుబంధు ఐదు నెలలకు వేశారు.. 2019-20లో 9 నెలలు, 2021-22 నాలుగు నెలలు పట్టిందన్నారు.
CM Revanth: 80 వేల పుస్తకాలు చదివిండు కానీ.. కేసీఆర్ పై విమర్శలు
ఇదిలా ఉంటే.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటున్నారన్నారు. మీ ఉద్యోగం పోయింది అని మీరు దుఃఖంలో ఉన్నారు.. నిరుద్యోగ యువత అలాంటి దుఃఖంలో లేరని సీఎం రేవంత్ తెలిపారు. మీలాగా అంగట్లో ప్రశ్నాపత్రం అమ్మకానికి పెట్టం.. మీ పేషీల్లో లాగా మా పేషీల్లో పైరవీకారులు లేరని పేర్కొన్నారు. తాము 6700 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్ళ ఇంట్లో మాత్రం కారుణ్య నియామకాలు జరిగాయి.. కానీ సింగరేణిలో జరగలేదని మండిపడ్డారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు నియామకం చేపడతామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గోల పెట్టినా.. నియామకాలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ కోటాలో ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు. సలహాదారులో షబ్బీర్ ఆలీకి అవకాశం ఇచ్చామని చెప్పారు. మైనార్టీలకు అన్ని రకాల అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Election Commission: దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు..
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో ఎక్కిన ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆటో రాముడు వచ్చాడు.. బీఆర్ఎస్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు.. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టు లెక్క.. ఆటో రాముడు కృష్ణానగర్ నుండి.. ఆఫీస్ కి ఆటోలో వెళ్లి డ్రామాలు చేశాడంటూ విమర్శించారు. ఇంకో నటుడు 100 పెట్టి పెట్రోల్ కొంటాడు.. పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చాం.. గత పాలనలో మొదటి టర్మ్ లో అసలు మహిళ మంత్రి పదవి ఇయ్యలేదని ఆరోపించారు. ఆడ బిడ్డల కోసం రెండు నెలలలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ తెలిపారు.