గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులు అప్పగించలేదని తెలిపారు. ఎక్కడి నుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.
Read Also: Hyderabad: జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మంది అరెస్ట్
కృష్ణా నది పై వచ్చిన వివాదానికి గత ప్రభుత్వ విధానమే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68 శాతం వాటా దక్కాలన్నారు. కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆర్ఎస్సేనని.. కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగిందని.. తెలంగాణకి కృష్ణా నదిలో అన్యాయం జరిగిందని మంత్రి తెలిపారు. ఏపీకి తరలిపోతున్న నీటి ఒప్పందం ప్రగతి భవన్ లో జరిగిందా లేదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టు కేఆర్ఎంబీకి ఇవ్వలేదు.. ఇవ్వమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Bumper Offer: పిల్లల్ని కంటే రూ.62 లక్షల ప్రైజ్‌మనీ! ఎక్కడంటే..!