కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. రండి కలిసి కొట్లాడదం.. ప్రాజెక్టులు గుంజుకుంటే కలిసి కొట్లాడదమన్నారు. సన్ స్ట్రోక్ ఈ రాష్ట్రానికి తగలొద్దు అనుకుంటున్నా.. ఒక్కడి కోసం ఇంత మందిని బలి పెడుతున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవవచ్చు.. రండి కలిసి పునర్నూర్మిద్దామని సీఎం తెలిపారు.
Malla Reddy: కేసీఆర్ కుటుంబంలో ఉన్నట్లు మా కుటుంబం నుండి ఉండాలి..
ఏ పాపం చూసినా హరీష్ కనపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల బైరవుడు హరీష్ అని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా పాపాలు అన్ని బయట పడుతున్నాయని ఆరోపించారు. 13 తేదీన కాళేశ్వరం పోదాం.. మేడిపండులాగా మేడిగడ్డ చూపిద్దాం అని అన్నారు. 13న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బస్సులు పెడతామని తెలిపారు. అందరం వెళ్లి చూద్దాం..
కేసీఆర్ కూడా 12న చర్చలో పాల్గొనాలి.. 13న కాళేశ్వరం రావాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Congress: పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటనపై కాంగ్రెస్ రియాక్షన్ ఇది!
కాంగ్రెస్ పార్టీని పదేపదే వారసత్వ పార్టీ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. కానీ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేసి మళ్లీ మూడు నెలలకు పదవులు స్వీకరించడమే వారు చేసిన పని అన్నారు. వీటిని త్యాగాలుగా చెప్పుకోవద్దని హితవు పలికారు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని ఆరోపించారు.