Rajesh Veeramalla
Author- NTV Telugu-
Joint Staff Council Meeting: సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చలు..
అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. పెండింగ్ డీఏ, ఏపీజీఎల్ఐ, ఐఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పరిష్కారం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
Rivaba: మామ ఆరోపణలు.. సీరియస్ అయిన రవీంద్ర జడేజా సతీమణి
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవీంద్ర జడేజా, తన కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు, కోడలితో చాలా కాలంగా దూరంగా ఉంటున్నానని.. సరైన సంబంధాలు లేవని చెప్పారు. తన కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా.. చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిపై రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా… -
U19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తెలుగు మాటలు.. వీడియో వైరల్
ఆదివారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Anam Ramanarayana Reddy: ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి - గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఇంచార్జ్ నేదురుమల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. -
Yarlagadda Venkatarao: ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా.. గన్నవరం భవిష్యత్తు మారుస్తా..
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలపై ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు 2024లో అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా.. స్థానిక సమస్యలపై యార్లగడ్డ ఆరా తీశారు. యువతను ఉత్సాహ పరిచేందుకు గ్రామంలోని పలు… -
YCP: వైసీపీ తరఫున ముగ్గురు నామినేషన్లు దాఖలు.. అభ్యర్థులు ఏమన్నారంటే..!
వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు.… -
CPI Ramakrishna: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది..
బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్తో బీజేపీ అందర్నీ లొంగ తీసుకుంటోందని ఆరోపించారు. సీబీఐ, జ్యూడిషియల్ ని గుప్పట్లో పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారని తెలిపారు. అధికారం కోసం పక్కా మైండ్ గేమ్ తో ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ లను మోడీ, అమిత్ షా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు జైల్ కి వెళ్లాడనికి కారణం మోడీ, అమిత్ షాలేనని రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 90శాతం మందికి ఇది తెలుసు..… -
GV Harsha Kumar: జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే సింహగర్జన ఉద్దేశం..
జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే దళిత సింహగర్జన ఉద్దేశమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. మరోసారి జగన్ సీఎం అయితే దళితులకు రక్షణ ఉండదన్నారు. రాజమండ్రిలో దళిత సింహ గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఈ సభ పెట్టలేదని వివరణ ఇచ్చారు. తనకు పదవులు కొత్తకాదని చెప్పారు. ఆత్మగౌరవం కోసం దళితుల సింహ గర్జన బహిరంగ సభ పెట్టానని.. జగన్ అహంకారానికి దళితుల ఆత్మగౌరానికి పోరాటం అంటూ పిలుపునిచ్చారు. -
U19 World Cup: సీనియర్ల బాటలో జూనియర్లు.. ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా గెలుపు
సీనియర్లు వరల్డ్ కప్ను చేజార్చారు. ఇప్పుడు జూనియర్లు అదే పని చేశారు. జూనియర్లు అయినా.. వరల్డ్ కప్ గెలిచి ప్రతికారం తీర్చుకుందామనుకుంటే.. వీళ్లు కూడా మేము కూడా మీ వెంటనే ఉంటామన్నంటూ కప్ గెలవలేకపోయారు. ఫైనల్ వరకు వచ్చి టైటిల్ ను మిస్సయ్యారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల లక్ష్యచేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా… -
BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల కీలక వైసీపీ నేతలు…!
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్, తలారి వెంకట సుధాకర్, తలారి చెన్నయ్య…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!