బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్క సుమన్ దగ్గరే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడి చెప్పు చూపించారు. తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు ఉండాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కి మా మెట్టుసాయి చెప్పు చూపెడతాడు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడటం తప్పు కదా అని తెలిపారు.
Lottery Win: అదృష్టమంటే ఇతడిదే..! ఫ్రీ లాటరీ టికెట్‌తో కోట్లు వచ్చిపడ్డాయి!
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడైనా అలాంటి విమర్శలు చేశామా అని జగ్గారెడ్డి అన్నారు. అంత అత్యుత్సాహం ఏందని బాల్క సుమన్ పై మండిపడ్డారు. ఈ చెప్పులు చూపించే సంప్రదాయం తీసుకువచ్చిందే బీఆర్ఎస్ వాళ్లని తెలిపారు. రేవంత్ కి చెప్పు చూపెట్టాల్సిన అవసరం ఏముంది..?. సుమన్ నువ్వు ఛాన చిన్నోడివి.. నీ కెపాసిటీ ఎంత..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో నువ్వే కొంత మందిని చంపి ఆత్మహత్యలుగా చిత్రికరించావని తెలిపారు. సీఎంపై చెప్పు చూపెట్టగానే పెద్దోడివి ఐతవా..?అని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ కి మా మెట్టుసాయి చెప్పు చూపెడతాడని చూపెట్టారు. సుమన్ మీద కేసులు కాదు.. బూటుతో కొడతాడు మా వాడని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 28,000 దాటిన మృతుల సంఖ్య..
మరోవైపు.. కేసీఆర్ ఫ్యామిలీ దగ్గరే డబ్బులన్నీ ఉన్నాయని, హరీష్ దగ్గర ఐదు వేల కోట్లు.. కవిత, సంతోష్ ఎంత దాచాడో అని విమర్శించారు. మార్కెట్ లో పైసలు అన్ని వీరి దగ్గరే ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా పాలనలో సొమ్ము ప్రజలు అనుభవిస్తున్నారు.. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టర్లు, ఆయన కుటుంబమే అనుభవించిందని తెలిపారు. మీ అవినీతిని బయటకు తీస్తుంటే సీఎం మీద విమర్శలు చేస్తారా..? అని దుయ్యబట్టారు.