గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు సీపీఆర్ చేశారు. సీపీఆర్ తర్వాత మహిళా స్పృహలోకి వచ్చింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Read Also: Crime News: భర్తపై అనుమానంతో భార్య ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే?
గుండెపోటు వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ.. ఇప్పుడు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఇలాంటి సంఘటనల్లో సీపీఆర్ చేసి చాలా మంది ప్రాణాలు కాపాడారు పోలీసులు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఎస్సై మహేందర్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కాగా.. సీపీఆర్ ద్వారా ఆ మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్సైని స్థానికులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Read Also: Jagga Reddy: సుమన్ నువ్వు ఛాన చిన్నోడివి.. నీ కెపాసిటీ ఎంత..?