తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్.. 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Delhi: ముగిసిన మోడీ 2.0 చివరి బడ్జెట్ సమావేశాలు
కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఈ బడ్జెట్ తో తేలిపోయిందని జగదీష్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులను, రైతులను నిండా ముంచారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడటానికి తాము సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంతో మాట్లాడకుండా తమపై ఎదురుదాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. నల్గొండలో నిర్వహించే సభలో చూసి ప్రభుత్వం భయపడుతుందని తెలిపారు.
Pawan Kalyan: రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. పొత్తులపై కీలక చర్చ!
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. కేంద్రంపై పోరాటం చేయకుండా బీఆర్ఎస్ సభను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు.. అందుకే విచారణ పక్క రాష్ట్రాలకు మార్చాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.