నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్, తలారి వెంకట సుధాకర్, తలారి చెన్నయ్య…
హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళావేదికలో మార్చి 22న 'మెలోడియస్ క్వీన్ సునీత ఉపద్రష్ట' ప్రత్యక్ష సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎస్.వి.యం గ్రాండ్ మరియు టెంపుల్ బెల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్, టెంపుల్ బెల్ ఈవెంట్స్ నిర్వహకులు కౌశిక్ రామ్ మద్దాలి, ఎస్.వి.యం గ్రాండ్ హోటల్ ఎం.డి. వర ప్రసాద్ తదితరులతో కలిసి సునీత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఎస్.వి.యం. గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..…
రేపు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించే అవకాశం ఉంది. కాగా.. ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. రేపు అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారని అన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని తెలిపారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి పాలు త్రాగి మోసం చేసినట్లేనని చెప్పాడన్నారు.
ఆదివారం ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగింది. ఇందులో 50కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా నటి శ్రీముఖి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ.. తనను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య…
రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపనుంది. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి.
తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.…
అండర్ 19 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ఓపెనర్ డిక్సన్ 42 పరుగులు, వీబ్జెన్ 48, హ్జాస్ సింగ్ 55, పీక్ 46 పరుగులతో రాణించారు. కాగా.. భారత్ బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తివారీ 2 వికెట్లు పడగొట్టగా.. ముషీర్, సామీ పాండే తలో…
సౌతాఫ్రికాలో జరిగిన ఎస్ఏ టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. నిన్న కేప్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగుల భారీ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో జోర్డాన్ హెర్మన్ 42, అబెల్ 55, కెప్టెన్ మార్ క్రమ్ 42 నాటౌట్,…
పొత్తులు, టిక్కెట్ కేటాయింపు విషయంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ లేదా విజయవాడ పశ్చిమలో రెండిట్లో ఓ సీటు తనకు ఇస్తారని.. తాను పోటీ చేస్తానని తెలిపారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నా నాలుక కోసుకుంటాను కానీ.. చంద్రబాబుని ఎప్పుడు విమర్శించనన్నారు. చంద్రబాబును అలా విమర్శించాల్సిన రోజే వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీలో ఎవరైనా టిక్కెట్టు రాలేదని చంద్రబాబుని బ్లాక్…