వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం కావడంతో సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలను, యువతను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, మహిళలను దగా చేశాడని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో అందరికీ అండగా ఉండాలని నారా లోకేష్ పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలని శంఖారావం కార్యక్రమంతో ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచడం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, బస్సు చార్జీలు మొదలగు అనేక రేట్లు పెంచి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది చేశాడని దుయ్యబట్టారు. తుగ్లక్ పరిపాలన నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని.. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే.. నారా లోకేష్ శంఖారావం కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు.
రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు మంచి భరోసా ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా ఉండడానికి, టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి భవిష్యత్తు గ్యారెంటీ పథకాలతో రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తామని, తాను కచ్చితంగా అసెంబ్లీకి పోతానని పాలకుర్తి తిక్కా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఖలదర్, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, వట్టెప్ప గారి నరసింహులు, బెళగల్ గుండేష్, హనుమంతు ఐ టిడిపి నియోజకవర్గ అధ్యక్షులు సల్మాన్ రాజు,పెద్ద భూంపల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.