సీనియర్లు వరల్డ్ కప్ను చేజార్చారు. ఇప్పుడు జూనియర్లు అదే పని చేశారు. జూనియర్లు అయినా.. వరల్డ్ కప్ గెలిచి ప్రతికారం తీర్చుకుందామనుకుంటే.. వీళ్లు కూడా మేము కూడా మీ వెంటనే ఉంటామన్నంటూ కప్ గెలవలేకపోయారు. ఫైనల్ వరకు వచ్చి టైటిల్ ను మిస్సయ్యారు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల లక్ష్యచేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో 1988, 2002, 2010లో ట్రోఫీని గెలుచుకుంది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తర్వాత అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది.
Read Also: Damodara Raja Narasimha : దసరా నాటికి కంకోల్ పీహెచ్‌సీ ప్రారంభం
254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఆటగాళ్లు తడబడ్డారు. సెమీఫైనల్ మ్యాచ్ లాగానే టైటిల్ మ్యాచ్ లోనూ భారత్ టాప్ ఆర్డర్లు నిరాశపరిచారు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 3 పరుగులకే ఔట్ కాగా.. మంచి ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ 22 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. మరోవైపు.. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సెమీఫైనల్లో లాగా ఫైనల్ లో ఆదుకుంటాడనుకున్న సచిన్ దాస్ కూడా.. 9 పరుగులు మాత్రమే చేశాడు. ప్రియాంషు మోలియా 9, వికెట్ కీపర్ అవినాష్ డకౌట్ అయ్యాడు. కాస్తో కూస్తో.. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 47, మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ డిక్సన్ 42 పరుగులు, వీబ్జెన్ 48, హర్జస్ సింగ్ 55, పీక్ 46 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తివారీ 2 వికెట్లు పడగొట్టగా.. ముషీర్, సామీ పాండే తలో వికెట్ తీశారు.
Read Also: Agra: భార్య గుడికి.. తల్లి, కొడుకును హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారవేత్త..