టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవీంద్ర జడేజా, తన కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు, కోడలితో చాలా కాలంగా దూరంగా ఉంటున్నానని.. సరైన సంబంధాలు లేవని చెప్పారు. తన కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా.. చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిపై రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన ఆరోపణలు నిజం కాదని.. కావాలనే అంటున్నాడని తెలిపారు.
Read Also: Hemant Soren: హేమంత్‌కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
ఇదిలా ఉంటే.. జడేజా భార్య గుజరాత్ లోని జామ్ నగర్ నియోజకవర్గం ఎమ్మె్ల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబాను కుటుంబ వివాదాలపై ప్రశ్నించింది మీడియా. అందుకు రివాబా స్పందిస్తూ.. ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి? మీరు అడుగుతున్నది ఏంటి? మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే విడిగా అడగండి.. చెబుతాను.. ఇక్కడ మాత్రం కాదు.. అని ఆ విలేకరిపై అసహనం ప్రదర్శించారు.
Read Also: U19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తెలుగు మాటలు.. వీడియో వైరల్