మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది... ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని తెలిపారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామాతో పాటు అసెంబ్లీ సభ్యత్వానికి చవాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత విషయమన్నారు. మరో రెండు రోజుల్లో తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ఈరోజు నుంచి తన రాజకీయ…
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో IR ను ప్రకటించాలని…
నెయ్యిలోని పోషకాల గురించి అందరికీ తెలిసిందే.. నెయ్యిని తినాలంటే రోటీలో కానీ పప్పు అన్నంలో కానీ ఎక్కువగా తింటూ ఉంటారు. అంతేకాకుండా.. నెయ్యిని తీపి వంటకాలు, మసాల వంటకాలల్లో వాడుతారు. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. నెయ్యి తినడం వల్ల మన శరీరంలోని ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. నెయ్యితో మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే నెయ్యి తినడమే కాకుండా ముక్కులో కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముక్కులో రెండు చుక్కలు వేసుకుంటే…
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాయపల్లి ఎంపీపీ పిలిస్తే మండల సమావేశానికి ఎమ్మెల్యే ఆనం వచ్చేస్తాడా? అని ప్రశ్నించారు. ఆనంవి సిగ్గులేని పనులు.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా పిలవని పేరంటాలకు వచ్చేస్తాడని విమర్శించారు. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ ద్వారా రైతులకు 200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనం అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.
మంగళూరులో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు నిరసన చేపట్టారు. ఒక కాన్వెంట్ స్కూల్‌లో హిందూ దేవుళ్లను అవమానించడం, విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో విద్యార్థులతో కలిసి మితవాద సంఘాలు నిరసనలు చేపట్టారు. కాథలిక్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు.. హిందూ దేవుళ్లను అవమానించడం, హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.