తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి – గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఇంచార్జ్ నేదురుమల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Masooda : త్వరలో ‘మసూద’మూవీకి ప్రీక్వెల్.. వెల్లడించిన ప్రొడ్యూసర్..
రాష్ట్ర పరిధిలో దాదాపు రూ. 400 కోట్ల రూపాయలు రోడ్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇటువంటి ఆర్థిక దుస్థితి, దుర్గతి ప్రభుత్వం పెట్టుకుని ఇతరుల మీద నిందలు వేయడం తప్పు అని ఆరోపించారు. రాష్ట్రంలో వారం, పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.. ఎన్నికల్లో అన్నీ పార్టీలు రంగంలో ఉంటాయని అన్నారు. తాను కూడా ఏదో ఒక పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసి మీతో ఉంటానని తెలిపారు.
Read Also:Tejashwi Yadav: మీ మేనల్లుడు ప్రధాని మోడీని అడ్డుకుంటాడు.. బలపరీక్ష సందర్భంగా తేజస్వి యాదవ్
మీతో (ప్రజలు) పాటూ ఈ ఎన్నికల్లో తాను పోరాటం చేస్తానని.. పోరాట ఫలితం మీరిచ్చే తీర్పును బట్టి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మీ తీర్పులో, తనను ఆశీర్వదిస్తే మీకు ఎమ్మెల్యేగా ఉంటానని ఆనం తెలిపారు. ఈ అవకాశం తనకు మళ్లీ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.