ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశ వాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు. తాను చేస్తున్నది నిర్మాణ రంగంలో.. వెలగపూడిలా…
విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47 రోజులుగా ఈ క్రీడలు జరిగాయి.. గ్రామ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు డైలమాలో ఉన్నాయి. హెలీపాడ్ ఏర్పాటుకు అధికారులు అనుమతుల నిరాకరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం పర్యటనను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. ఇటు.. అమలాపురంలోనూ హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని గమనించి వస్తుండగా.. సయ్యద్ షఫీ అనే…
ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా కష్టం కానీ.. బరువు పెరగడం చాలా సులభం. కానీ కొందరు సన్నగా ఉన్నవారు.. ఏమీ తిన్న అంత తొందరగా బరువు పెరగరు. దీంతో తినరాని ఫుడ్స్ తీసుకుంటారు. కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతుంటారు. కాగా.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా.. రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగకపోతే ఏం…
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తెలంగాణలోని భువనగిరి సాంఘీక వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా.. అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించవలిసి ఉంటుంది. ఆ నిబంధనలన్నీ భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతాయి. రోడ్డుపై మీరు ఎక్కడికైనా బైక్ పై వెళ్తున్నట్లయితే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా స్పీడ్‌ను పరిమితిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై ఇద్దరికి మించి ప్రయాణించకూడదు. ఒకవేళ ఆ నియమాలను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
పైథాన్ అంటే అందరికీ భయమే.. దాన్ని చూడగానే కిందనుండి కారిపోతుంది. అది కాటు వేయకున్నా గానీ, చాలా ప్రమాదకరం. లైవ్లో గానీ, మ్యూజియంలో గానీ పైథాన్ను చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిస్తుంది. కానీ.. ఒక మహిళ మాత్రం తన చేతులతో భారీ కొండచిలువను ఎలా పట్టుకుందో చూస్తే షాకైపోతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏ మాత్రం భయం లేకుండా కొండచిలువను పట్టుకుంది.
విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.