జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే దళిత సింహగర్జన ఉద్దేశమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. మరోసారి జగన్ సీఎం అయితే దళితులకు రక్షణ ఉండదన్నారు. రాజమండ్రిలో దళిత సింహ గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఈ సభ పెట్టలేదని వివరణ ఇచ్చారు. తనకు పదవులు కొత్తకాదని చెప్పారు. ఆత్మగౌరవం కోసం దళితుల సింహ గర్జన బహిరంగ సభ పెట్టానని.. జగన్ అహంకారానికి దళితుల ఆత్మగౌరానికి పోరాటం అంటూ పిలుపునిచ్చారు.
Read Also: U19 World Cup: సీనియర్ల బాటలో జూనియర్లు.. ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా గెలుపు
దళితులను ఇంతగా చిన్నచూపు చూసిన ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ తప్ప మరొకరు లేరని విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి అమ్మఒడి ఇచ్చారని ఆరోపించారు. యాత్ర-2 డైరెక్టర్ కు పేదల భూములు ఇచ్చారు కానీ, జగన్ భవనంలో బాత్ రూమ్ అంత కూడా పేదల ఇళ్లు ఉండటం లేదని ఆరోపించారు. కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి లోన్ ఇవ్వలేదని మండిపడ్డారు. మణిపూర్ లో క్రైస్తవులపై హింస మీద సీఎం జగన్ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల కీలక వైసీపీ నేతలు…!